AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మార్చురీ సిబ్బంది నిర్వాకం

మృతదేహాలను తారుమారు చేసిన సిబ్బంది
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని మార్చురీ సిబ్బంది బంధువులకు అప్పగించారు. తీవ్ర విషాదంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన బంధువులు.. డెడ్ బాడీపై కప్పి ఉంచిన వస్త్రాని తొలగించి చూసి ఖంగుతున్నారు. ఇది తమ మృతదేహాం కాదని తెలుసుకొని తిరిగి ఆసుపత్రికి అప్పగించారు.

వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తానేధార్‌పల్లి గ్రామానికి చెందిన రాగుల రమేష్‌ (40) కుటుంబ కలహాలతో ఈ నెల 24న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న రమేశ్ శనివారం ఉదయం మృతి చెందారు. హనుమకొండ జిల్లా వంగర మండల కేంద్రానికి చెందిన ఆశాడపు పరమేశ్వర్‌(53) ఈ నెల 22న రాత్రి యాక్సిడెంట్‌కు గురయ్యాడు. తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎల్కతుర్తి క్రాస్‌రోడ్డులో చోటు చేసుకున్న యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో పరమేశ్వర్‌ కుటుంబ సభ్యులు అతడిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరమేశ్వర్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

రమేశ్, పరేమేశ్వర్ మృతదేహాలకు ఎంజీఎం ఆవరణలోని మార్చురీలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఇరు కుటుంబాలకు మృతదేహాలను మార్చురీ సిబ్బంది మృతదేహాలను అప్పగించారు. రెండు కుటుంబాల చెందిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయి పూర్తిగా కప్పి ఉంచిన మృతదేహాలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మృతదేహంపై ఉన్న వస్త్రాన్ని తీసి చూసిన బంధువులు ఖంగుతున్నారు. అది తమకు సబంధించిన మృతదేహం కాదని నిర్ధరించుకొని పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10