AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాకు నమ్మకం లేదు ..

సిట్‌కు బండి సంజయ్ లేఖ
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. విచారణలో వేగం పెంచిన సిట్.. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తుండగా.. అన్ని కోణాల్లోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్న పలువురు రాజకీయ నేతలకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. సిట్ విచారణకు హాజరై.. తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఒకే మండలానికి చెందిన ఎక్కువ మంది గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించారని.., పేపర్ లీకేజీ కారణంగానే వారందరూ క్వాలిఫై అయ్యారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ (మార్చి 26న) విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను విచారణకు హాజరు కాలేనంటూ సంజయ్ సిట్ అధికారులకు లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఇవాళ విచారణకు రాలేనని చెప్పారు.

“రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై నాకు నమ్మకం లేదు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇద్దరు మాత్రమే నిందితులని బాధ్యత గల ఓ మంత్రి చెప్పారు. ఈ స్కామ్‌ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తు్న్నారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని చెబుతున్నారు. రాజకీయాలను పక్కన పెడితే..ఈ లీకేజీ వల్ల నేడు లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదనలో ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10