AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేదాకా ఉద్యమిస్తాం

బీజేపీ అధికారంలోకి రాగానే..
2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ను ప్రకటిస్తాం
నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారమిచ్చేదాకా ఊరుకోం
నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్‌

హైదరాబాద్‌: ‘‘కేసీఆర్‌ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ నాశనమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ మండిపడ్డారు. నిరుద్యోగుల్లారా మేమున్నాం…మీరేం భయపడకండి. బీజేపీ అధికారంలోకి రాగానే….. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ను ప్రకటిస్తాం. డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం’’ అని బండి సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. బీజేపీ ఈరోజు ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నా సందర్భంగా బండి సంజయ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ‘‘తెలంగాణ ఉద్యమకారులారా…. ఇంకెన్నాళ్లీ మౌనం? ఏమైంది ఆనాటి ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్‌ కేసులు పెడతారని భయపడుతున్నారా? 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల నాశనమవుతున్నా స్పందించరా?. రండి మీకు అండగా మేమున్నాం. మీకు బాధవస్తే మా భుజాన వేసుకుంటాం… కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేదాకా ఉద్యమిస్తాం.. నిరుద్యోగుల తరపున రొడ్డెక్కి కొట్లాడదాం.. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం రండి’’అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు విచ్చేసిన నిరుద్యోగులకు, విద్యార్థి జేఏసీ నాయకులకు, డీఎస్సీ-2008 బాధితులకు, పార్టీ కార్యకర్తలకు అభినందనలు.
30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైళ్లో వేశారు. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారు.. జైళ్ల డీజీ ఖబడ్దార్‌….వచ్చేది మా ప్రభుత్వమే.. నీకు చిప్పకూడు తిన్పిస్తాం…
ఉస్మానియా వర్శిటీ వెళ్లి చూస్తే ఎంత దారుణ పరిస్థితులున్నాయో తెలుసుకోండి.. 30 లక్షల మంది నిరుద్యోగులు చస్తుంటే కనీసం పట్టించుకోని కేసీఆర్‌…. రాహుల్‌ గాంధీ కోసం బ్లాక్‌ డే అంటావా?
బీఆర్‌ఎస్‌ నిద్ర మత్తులో ఉంది… ఇక ఆ పార్టీ లేవదు…
ఉస్మానియా విద్యార్థులారా…. తెలంగాణ తరహాలో మరో పోరాటానికి సిద్ధం కండి… మేం మీ వద్దకు వస్తాం… పోలీసు వలయాలను చేధించుకుని మీ తరపున పోరాడతాం…
సబ్బండ వర్గాలు చేసిన తెలంగాణలో రాళ్లు మోసినోళ్లు దొంగలయ్యారు… రాళ్లు విసిరినోళ్లు రాజులాయే…
నిరుద్యోగులు డబ్బుల్లేక మధ్యాహ్నం లంచ్‌ చేయరు… అన్నీ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తున్నారు. వయసు మీదపడ్డా ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకుంటూ చదువుకుంటున్నారు. కుటుంబాలకు భారమైనరు.
కేసీఆర్‌ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు… ఉద్యోగాలివ్వదు… నిరుద్యోగులను మోసం చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తారు.. లీకేజీలతో జాప్యం చేస్తూనే ఉంటారు.
లీకేజీకి ఇద్దరు, ముగ్గురికే పరిమితం కాలేదు.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే వాళ్లు బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యల్లేవని బండి సంజయ్‌ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10