సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందిరికీ తెలిసిందే. ఆయన నిత్యం ఏదో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రజలకు జాగ్రత్తలు చెప్పటం, అవగాహన కల్పించటం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందిస్తారు. సంస్థలో పని చేసే వారిని ఎప్పటికప్పుడు పోత్సహిస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసిస్తూ ఉంటారు.
తాజాగా.. ఓ జేసీబీ డ్రైవర్ చేసిన పనికి సజ్జనార్ సార్ ఫిధా అయ్యారు. ఓ కుక్క పెద్ద గుంతలో పడిపోయి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అక్కడే పని చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్ కుక్క పడుతున్న అవస్థలను గమనించాడు. జేసీబీ బొక్కెన సాయంతో కుక్కను సురక్షితంగా గుంతలో నుంచి బయటకు తీసి కాపాడుతాడు. అందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం” అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సజ్జనార్ షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగా ఆకట్టుకుట్టుంది.