ఈటలను ఇంటికి పంపిస్తా: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా పాడి కౌశిక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తనపై నమ్మకం ఉంచి విప్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని కౌశిక్ రెడ్డి అన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. తనకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ తన పేరును ప్రకటించారని గుర్తు చేశారు. హుజురాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈటలపై భారీ మెజార్టీతో విజయం సాధించి.. ఆయన్ను ఇంటికి పంపిస్తానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యనించారు. శాసనమండలి విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్ రెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కౌశిక్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా.. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.