టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. రేవంత్ ఇంటి చుట్టుపక్కల పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రేవంత్ ఇంటి వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. రేవంత్ ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారు. ఈ పరిణామాల క్రమంలో రేవంత్ ఇంటి వద్ద టెన్షన్ వాతారణం నెలకొంది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ స్టూడెంట్స్ నిరసన దీక్షకు ప్లాన్ చేశారు. అయితే విద్యార్థుల దీక్షకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు.. దీక్షలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కానీ దీక్ష చేసి తీరుతామని ఓయూ విద్యార్థులు చెబుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేస్తోన్నారు.