ఆదిలాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డ.. బీజేపీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని అన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. జనాభాలో సగంగా ఉన్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని శ్రీనన్న వివరించారు.
మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా మహిళ భద్రతకు అత్యంత కట్టుదిట్టమైన చట్టాలను తెచ్చిందన్నారు.