పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. అలాంటి లీడర్ ఇటీవల అధికార పార్టీపై డైలాగ్‌లతో దండయాత్ర చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకు గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఆయన కారు పార్టీకి దూరం జరిగినా.. ఇంతవరకు ఏ పార్టీ చెంతకు చేరలేదు. దీంతో ఆ పార్టీలో చేరతారు.. ఈ పార్టీలో చేరతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం హాట్ టాపిక్‌గా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బలమైన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేత ఇటీవల బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. అక్కడితో ఆగకుండా.. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో.. Ponguleti Srinivas Reddy బీజేపీలో చేరతారని కొందరు.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొందరు.. కొత్త పార్టీ పెడతారని ఇంకొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కీలక పరిణామం చోటు చేసుకుంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi ఫోన్ చేశారని ప్రచారం జరుగుతోంది. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి రావాలని రాహుల్ కోరినట్లు సమాచారం. అయితే.. రాహుల్ గాంధీ నుంచి పొంగులేటికి ఫోన్ వచ్చిందనే విషయం ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఆయన్ను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు అమిత్ షా వంటి నేతలు ప్రయత్నించినట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే.. ఖమ్మంలో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవనే టాక్ ఉంది.