న్యూఢిల్లీ: ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సెక్షన్లు 499, 504 కింద కోర్టు రాహుల్ గాంధీకి ఈ శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే ’ అంటూ 2019లో రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిగిన ఓ సభ్యలో వ్యాఖ్యనించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్ఏ పూర్ణేశ్ మోడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశారు. రాహుల్ వ్యాఖ్యలు మొత్తం ‘మోడీ’ సముదాయాన్నే అపఖ్యాతిపాలు చేసేదిగా ఉందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ…వీరందరి ఇంటి పేరు మోడీ అని ఉండడమే. వీరంతా ఏదో ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నవారే.