అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వడగండ్ల వర్షంలో చిక్కుకుంది. ఇండిగో విమానం ఎయిర్‌పోర్టులో దిగుతున్న సమయంలో భారీగా వడగండ్ల వాన పడుతోంది. వడగండ్ల దెబ్బకు విమానం ముందుభాగం, ముందు అద్దాలు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే విమానం సురక్షితంగా 27ఎల్ రన్‌వేపై ల్యాండ్ అయిందని, ప్రయాణికులు కాని, సిబ్బందికి కాని ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఇండిగో తెలిపింది. గత వారం హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో వడగండ్ల వర్షం బీభీత్సం సృష్టించింది. హైదరాబాద్ చాలా సంవత్సరాల తర్వాత భారీస్థాయిలో వడగండ్ల వర్షాన్ని చవిచూసింది.