సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పర్భానీ-మన్మాడ్ సెక్షన్‌లోని నాగర్సోల్ స్టేషన్ మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల పలు రైళ్లను కొన్ని రోజుల పాటు పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్ని ట్రైన్లను పాక్షికంగా కొన్ని స్టేషన్ల మధ్య రద్దు చేశారు. ట్రైన్ల వివరాల విషయానికొస్తే..
జల్నా-నాగర్సోల్ మధ్య(07497) ట్రైన్ 26వ తేదీ, జల్నా-నాగర్సోల్ మధ్య(07493) ట్రైన్ 22,24వ తేదీ, నాగర్సోల్-జల్నా(07494) ట్రైన్ 22,24,26వ తేదీల్లో రద్దు చేశారు. జల్నా-నాగర్సోల్(07491) ట్రైన్ 20,21,23వ తేదీలలో, నాగర్సోల్-జల్నా(07492) రైలు 20,21,13వ తేదీలలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నర్సాపూర్-నాగర్సోల్(12787) ట్రైన్‌ను 12,22,23,25వ తేదీల్లో ఔరంగాబాద్-నాగర్సోల్ మధ్య, నాగర్సోల్-నర్సాపూర్(12788) ట్రైన్ నాగర్సోల్-ఔరంగాబాద్ మధ్య 22,23,24,26 తేదీల్లో రద్దు చేశారు.
ఇక నర్సాపూర్-నాగర్సోల్(17231) ట్రైన్ 24వ తేదీలో ఔరంగాబాద్-నాగర్సోల్ మధ్య, నాగర్సోల్-నర్సాపూర్(17232) రైలు 25వ తేదీలో నాగర్సోల్-ఔరంగాబాద్ మధ్య రద్దు చేశారు. మన్మాడ్-ధర్మాబాద్(17687) ట్రైన్ 23,26వ తేదీల్లో రెటోగన్-మన్మాడ్ మధ్య, ధర్మాబాద్-మన్మాడ్(17688) ట్రైన్ 23,26వ తేదీల్లో మన్మాడ్-రెటోగన్ మధ్య రద్దు చేశారు.