హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కవితతో పాటు కెటిఆర్, ఎంపి సంతోష్ ఢిల్లీకి పయనమయ్యారు.