హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్‌లో(Minister’s Quarters) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని(Minister Niranjan Reddy) ఆదివారం కాంగ్రెస్ నాయకులు కలిశారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను(Farmers) ఆదుకోవాలని కాంగ్రెస్(Congress) ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలు ఇతర వివరాలు అంచనా వేసి తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, వి.హెచ్, కోదండ రెడ్డి, రాములు నాయక్ తదితరులు ఉన్నారు.