ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కవిత గత ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం, కోర్టులలో వరుస పిటిషన్లు వేస్తుండటంతో గందరగోళంగా మారింది. రేపు మరోసారి కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. రేపు అయినా కవిత ఈడీ ముందు హాజరవుతారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ నెల 16న కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. అందుకు డుమ్మా కొట్టారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.
గత విచారణ సందర్భంగా తన తరపున లాయర్లను కవిత ఈడీ కార్యాలయానికి పంపారు. దీంతో ఈ నెల 20న నేరుగా విచారణకు హాజరుకావాల్సిందిగా కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే కవిత కోర్టులను ఆశ్రయిస్తుండటంతో సోమవారం కవిత హాజరుపై హైడ్రామా నెలకొంది. ఈ సారి కూడా కవిత ఈడీ విచారణకు డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. రెండోసారి కూడా విచారణకు కవిత డుమ్మా కొడితే ఈడీ ఏం చేస్తుంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
విచారణకు హాజరుకాకపోతే ఈడీ తరుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రపిళ్లై కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో రామచంద్రపిళ్లైతో కలిసి కవితను రేపు ఈడీ విచారించే అవకాశముంది. రామచంద్రపిళ్లై కస్డడీ పొడిగించాలని రేపు ఈడీ కోర్టును కోరనుంది. దీంతో రేపు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.