AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్టాల నుంచి బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లను ఇచ్చిన ఇండియన్ రైల్వేస్ తాజాగా మరో అధునాతన సదుపాయలతో కూడిన టూరిస్ట్ ట్రెయిన్‌ను కూడా అందించింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి మొట్టమొదటిగా భారత్ గౌరవ్ రైలు శనివారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రైలు తొలి పర్యటనలో ప్రయాణించే యాత్రికులను అలరించేందుకు కూచిపూడి నృత్యకారులు ప్రదర్శించిన సన్నివేశాలు సాంప్రదాయం ఉట్టి పడేలా.. స్వాగతం పలికే సన్నివేశంతో స్టేషన్ ఆవరణమంతా పండుగ వాతావరణం నెలకొంది .ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ యాత్రికులకు స్వాగత కిట్‌లను కూడా అందజేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన తెలుగు రాష్ట్రాల భారత్ గౌరవ్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీ ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. యాత్రికులు సాంస్కృతిక పరమైన పలు ప్రముఖమైన పుణ్య క్షేత్రాలను సందర్శించడానికి వ్యక్తిగత ప్రయాణ ప్రణాళిక వల్ల ఏర్పడే అవాంతరాలు లేకుండా ఉండేలా, ఈ రైలు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో పర్యాటక వృద్ధికి ఒక పెద్దపీట వేస్తాయని, అదే సమయంలో పర్యాటక ప్రయాణికుల కోరికలను అత్యంత అనుకూలమైన రీతిలో నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఐఆర్‌సీటీసీ ఎండీ రజినీ హసిజ మాట్లాడుతూ, పర్యాటకుల ఆసక్తితో పాటు పుణ్య క్షేత్ర ప్రదేశాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మొత్తం పర్యటన ప్రయాణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రదేశాలను సందర్శించాలనుకునే వ్యక్తులకు తక్కువఖర్చుతో, సురక్షితమైన, అత్యంత సౌకర్యవంతమైన ఎంపికను అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.

భారత్ గౌరవ్ ప్రత్యేకతలు
‘పుణ్య క్షేత్ర యాత్ర: పూరీ-కాశి-అయోధ్య’ అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది. ఈ పర్యాటక రైలులో ప్రయాణించే యాత్రికుల కోసం పర్యటన ఆద్యంతం వరకు అన్ని రకాల సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది . ఇందులో అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం , మద్యాహ్న భోజనం, రాత్రి భోజనం రైలు ప్రయాణంలో, వెలుపల రెండూ) ప్రొఫెషనల్ అనుభవం కలిగిన వారితో అందరికీ నచ్చేలా స్నేహ పూర్వక సేవలు, రైలులో ప్రయాణికుల భద్రత(అన్ని కోచ్‌లలో అమర్చిన సీసీటీవీ కెమెరాలతో సహా), అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, ప్రయాణం అంతటిలో యాత్రికులకు కావాల్సిన సహాయం కోసం అందించడం కోసం ఐఆర్‌సీటీసీకి చెందిన పర్యాటక మేనేజర్‌‌ల సమక్షంలో సిబ్బంది యాత్రికులకు సేవలందిస్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10