బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయ్యారు. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన చరణ్ తన తండ్రితో కలిసి అమిత్ షాను కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటోన్న సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదిలావుండగా ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని మోడీతో ఆయన వేదికను పంచుకున్నారు.