AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండి సంజయ్ మెరుపు ధర్నా

హైదరాబాద్: అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‎కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో గన్‎పార్క్ వద్ద ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని నిరసన దీక్ష చేస్తోన్న బండి సంజయ్‎ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో బీజేపీ కార్యకర్తలు పోలీస్ గోబ్యాక్ అంటూ బీజేపీ క్యాడర్ పెద్ద ఎత్తున‌ నినాదాలు చేస్తోంది. ఇదే క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

కాగా, బండి సంజయ్‎కు పోలీసులు హుకుం జారీ చేశారు. ఒంటి గంట వరకు గన్ పార్క్‎ను విడిచి వెళ్ళాలంటూ సంజయ్‎కు పోలీసులు ఆదేశించారు. శాంతియుత దీక్ష చేస్తోన్న తమను అరెస్టు చేస్తే.. తీవ్ర పరిణామాలుంటాయని బండి సంజయ్ హెచ్చరించారు. ట్రాఫిక్ జాంతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారని , పరిస్థితిని అర్థం చేసుకోవాలని సంజయ్‎కి పోలీసులు తెలిపారు. మరి కాసేపట్లో బండి సంజయ్‎ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10