హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న “రంగమార్తాండ” చిత్ర లిరికల్స్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది, మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.
దర్శకుడు కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ ‘రంగమార్తాండ’ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.