ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. కాగా ఈ సినిమా ఆస్కార్ సొంతం చేసుకుకోవడంతో అందరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు. అర్హతలేని సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారని అన్నారు రెహమాన్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారనిపిస్తోంది.. కానీ ఏం చేస్తాం చూస్తూ ఉండటం మాత్రమే చేయగలం అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆర్ఆర్ఆర్ తో పాటు గుజరాతీ చిత్రం చెల్లో షో కూడా ఆస్కార్ నామినేషన్ కు వెళ్ళింది. కానీ ఆ సినిమాకు అవార్డు దక్కలేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సమయంలో రెహమాన్ ఇలా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మరి దీని పై రెహమాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.