హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న రోగి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీన పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని గాంధీ దవాఖానకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ సోమవారం ఉరేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.