AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆస్తి కోసం తండ్రిని స‌జీవ ద‌హ‌నం చేసిన కూతుళ్లు..

కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో ఓ కిరాతక సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి గొడవలు మానవత్వాన్ని మరిపిస్తున్నాయి. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, భార్యా భర్తలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఎకరం భూమి అమ్మితే వచ్చిన 10 లక్షలు ఇవ్వలేదని తండ్రినే సజీవ దహనం చేశారు కూతుళ్లు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే ఆంజనేయులుకు కొడుకులు లేరు. ముగ్గురు కూతుళ్ళకు పెళ్లిళ్లు కాగా లీల ఆమె కొడుకు భాను ప్రకాష్ అంజనేయులుతో ఉంటున్నారు. గంగమని కూడా రాజంపేటలోనే ఉండగా మరొక కూతురు నర్సవ్వ వేరే గ్రామంలో ఉంటోంది. అయితే ఇటీవల ఆంజనేయులు ఎకరం భూమి అమ్మేయగా 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో తండ్రితో కూతుళ్లకు గొడవ జరిగింది. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని గుడిసెలోనే ఉంచిన ముగ్గురు కూతుళ్లు మనుమడు భానుప్రకాశ్ సహకారంతో గుడిసెకు నిప్పంటించారు. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న ఆంజనేయులు సజీవదహనం అయ్యాడు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10