ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల గురించి పుకార్లు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో నాయకులు తమ కార్యకర్తలను నిద్ర లేపే ప్రయత్నం చేయడం కోసమే ముందస్తు ఎన్నికల హడావుడి చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా కూడా వైకాపా కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అధికారం కట్టబెట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరో సారి వైకాపా ని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర కి పెద్దగా ఆదరణ లభించడం లేదని ఆయన ఎద్దేవ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన కెరీర్ చాలా బాగుంది. సినిమా ల్లోనే ఆయన కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కనుక ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదని పేర్కొన్నారు.