AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల పవిత్రతకు భంగం: అలిపిరి మెట్లమార్గంలో మాంసాహారం తిన్న కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు

ఏడుకొండలవాడి ఆలయానికి నడిచి వెళ్లే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్టు సిబ్బంది మాంసాహారం (మటన్) తినడం స్థానికంగా, భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. తిరుమల కొండపై మరియు మెట్ల మార్గంలో మాంసాహారం, మద్యం వినియోగం పూర్తిగా నిషేధమన్న విషయం తెలిసి కూడా సిబ్బంది బహిరంగంగా మాంసాహారం తినడంపై భక్తులు మండిపడ్డారు, దీనితో పవిత్రమైన మెట్ల మార్గం అపవిత్రతకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు.

బహిరంగంగా మటన్ తింటున్న ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి, సరసమ్మల చర్యను చూసి అటుగా వెళ్తున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, ఈ విషయం వెంటనే టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన ఈ ఘటనను టీటీడీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మాంసాహారం తిన్న ఆ కాంట్రాక్టు కార్మికులు రామస్వామి, సరసమ్మలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తక్షణమే తొలగించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

 

ANN TOP 10