AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనం బాట’లో కవిత నయా అవతార్: సింప్లిసిటీతో జయలలిత స్టైల్‌ను అనుకరిస్తున్నారా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జనం బాట’ పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆమె లుక్, స్టైల్‌ పూర్తిగా మారిపోయి చర్చనీయాంశమైంది. గతంలో ఖరీదైన చీరలు, కాస్ట్‌లీ వాచ్‌లతో దర్పంగా కనిపించే కవిత, ఇప్పుడు సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఆహార్యంలో కనిపిస్తున్నారు. ఈ మేకోవర్‌ వెనుక ప్రజలకు మరింత దగ్గరయ్యే ఉద్దేశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కవిత కొత్త లుక్‌లో ముఖ్యంగా మూడు మార్పులు కనిపిస్తున్నాయి: ఆమె ఖరీదైన వాచీలకు బదులుగా కేవలం మట్టి గాజులు ధరిస్తున్నారు. ఖరీదైన పట్టు చీరలకు బదులు చేనేత చీరలు కట్టుకుంటూ, చేనేత కార్మికులకు మద్దతుగా సందేశం పంపుతున్నారు. ఇక హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చి, తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో ప్రాధాన్యత ఉన్న కొప్పును ఎంచుకున్నారు. అంతేకాకుండా, ఆమె నడక, ప్రజలకు అభివాదం చేసే విధానం కూడా పూర్తిగా మారింది.

త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న కవిత, అందుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటున్నారని అంటున్నారు. ఆమె ఆహార్యం తమిళనాడులో పురచ్చి తలైవిగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయాలలో దృష్టిపరమైన గుర్తింపు ఎంత ముఖ్యమో జయలలిత నిరూపించారు. మహిళల్లో బలమైన సెంటిమెంట్‌ను క్రియేట్ చేసి, జనం గుండెల్లో బలమైన నాయకురాలిగా నిలిచిపోవాలనే ప్రయత్నంలోనే కవిత ఈ కొత్త శైలిని ఎంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ANN TOP 10