AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ స్టైలు, హ్యాండ్స‌మ్‌కు ఫిదా అవ్వాల్సిందే


టాలీవుడ్‌ లోనే మోస్ట్ హ్యాండమ్‌ లుక్స్‌తో.. అందర్నీ ఫిదా చేసే మహేష్ బాబు.. ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్‌ మూవీ షూట్లో బిజీ గా ఉన్నారు. తన డైరెక్షన్లో తెరకెక్కుతోన్న SSMB28 సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. అతి త్వరలోనే ఆ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెంటనే పాన్ ఇండియన్ డైరెక్టర్‌ రాజమౌళి సినిమా సెట్‌కు షిఫ్ట్ కానున్నారు. ఇక ఈ క్రమంలోనే తన SSM28 లుక్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు మహేష్. దాంతో పాటే లాంగ్‌ హెయిర్‌లో మరింత హ్యాండ్‌సమ్‌గా మేకోవర్ అయ్యారు. ఇదే హెయిర్‌ స్టైల్‌తో.. బయట కూడా కనిపిస్తున్నారు.సినిమాలో మరోలా కనిపించే ఛాన్స్‌ ఉందని.. నిన్న మొన్నటి వరకు నెట్టింట కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా షూట్‌ నుంచి కొన్ని ఫోటోలు మహేష్ SSMB28 లుక్స్‌ ఫిక్స్ అనే ట్యాగ్‌తో.. షూట్‌ నుంచి బయటికి వచ్చిన ఈ ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ANN TOP 10