AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో మెగా డీఎస్సీపై లోకేష్ కీలక ప్రకటన..! నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరంలో టీచర్ల ఖాళీల భర్తీ కోసం దీన్ని విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక సంకేతం ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేశారు.

 

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నవ్యాంధ్రలోనూ 80శాతంపైగా టీచర్ల నియామకం చేసింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తుచేసారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు.

 

ప్రతీ శుక్రవారం కమిషనర్ ఉపాధ్యాయులకు వారి సమస్యలపై అందుబాటులో ఉంటున్నారని, తాను కూడా కలుస్తున్నానని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.

విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామన్నారు. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10