పోయిన చోటే వెతుక్కోవాలి.. ఇదీ తెలంగాణ బీజేపీ నేతల నయా స్ట్రాటజీ. గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబట్టుకోలేని కమలనాథులు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం కోసం కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో పర్సన్ టూ పర్సన్.. ఫార్ములా కాషాయ పార్టీకి కలిసొస్తుందా.. లేక బెడిసి కొడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు కాషాయ పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం.. మూడు ఎమ్మెల్సీ స్థానాలనూ కైవసం చేసుకొని సత్తా చాటాలని భావిస్తోందట. అటు ఉపాధ్యాయులను, ఇటు పట్టభద్రులను.. పర్సన్ టు పర్సన్ కలుస్తూ ప్రచారం చేస్తోందట. నేతల సమన్వయం కోసం ఇప్పటికే బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలు వేసిన టీబీజేపీ నేతలు.. ఒక్కో జిల్లాకు కోఆర్డినేటర్లను సైతం నియమించిందట. అంతేకాదు.. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు చొప్పున రాష్ట్రస్థాయి లీడర్లను సమన్వయకర్తలుగా నియమించి.. ర్తి సమన్వయంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్‌లో గెలుపే ధ్యేయంగా కమలదళం ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే ఈ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. మీటింగ్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అభ్యర్థులు సహా ముఖ్య నేతలూ హాజరయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. పీ ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని పార్టీ నియమించింది. కమిటీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు , పార్టీ ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్ ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కమిటీలను వేసి.. నేతలకు పని విభజన చేసేందుకు కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోందట. అంతేకాకుండా.. త్వరలోనే అసెంబ్లీ, జిల్లా స్థాయిలో వర్క్ షాప్‌లు నిర్వహించాలని కమలం పార్టీ భావిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలని.. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని నేతలు వ్యూహరచన చేస్తున్నారట. స్థానిక సంస్థల్లో గెలుపే.. ర్టీ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని, అందుకే ఎవరూ కాంప్రమైజ్ అవ్వొద్దంటూ పార్టీ పెద్దలు..తలకు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం.. మార్చి చివరినాటికి ముగియనుంది. ఆ ఎన్నికలకు.. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో కమలం పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యారట. అన్ని పార్టీల కంటే.. ముందే మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాషాయదళం.. దూకుడుగా ముందుకు వెళ్తోందట.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి.. రోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ స్థానానికి మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానాలకు అంజిరెడ్డి ప్రచారం చేస్తున్నారు, నేరుగా పర్సన్ టూ పర్సన్ కలిసి ఓట్లు అడుగుతున్నారు. కచ్చితంగా గెలుస్తామని.. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నానే ధీమాను వ్యక్తం చేస్తున్నారట. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్.. రెండు ఎమ్మెల్సీల పరిధిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండటంతో.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమాలో పార్టీ వర్గాలున్నాయట. అంతేకాదు.. డి రాకేష్ రెడ్డి లాంటి నేతలు.. త్తర తెలంగాణ బీజేపీకి అడ్డా అని పార్టీ భావిస్తోందట, ఫార్మ్ హౌస్ పార్టీకి, అవినీతి నేతలకూ బుద్ధి చెప్పేలా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తీరుతామంటున్నారు కాషాయ నేతలు.
సమయం తక్కువగా ఉండటంతో సెగ్మెంట్ల వారీగా… పర్సన్ టు పర్సన్ ఓటర్లను కలిసి గ్రౌండ్ స్థాయిలోకి చొచ్చుకుని వెళ్లాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే.. స్థానికసంస్థలకు పునాదిగా భావిస్తున్న కమలం పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతుందా.. అందుకు బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా.. లేదా.. అనేది వేచి చూడాలి.