సౌత్ ఇండియా సినీ స్టార్లు మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యశ్, రజనీకాంత్, విజయ్ తదితరులకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కీలక సూచన చేశారు. వారందరూ తన స్నేహితులేనని పేర్కొన్న ఆయన.. వారు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపాలని, ఎందుకంటే ఈ విషయంలో వారిని ఫాలో కావడం కష్టమని చెబుతూ నవ్వులు పూయించారు. దుబాయ్ వేదికగా జరిగిన ‘గ్లోబల్ విలేజ్‘ కార్యక్రమానికి హాజరైన షారుఖ్ ఖాన్ వేదికపై డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, షారుఖ్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జవాన్’ సినిమా రూ. 1000 కోట్లకుపైగా వసూలు చేసింది.