వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. పల్లెలు, పట్టణాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. లక్ష్మీపూజలు, నోములు, వ్రతాలు ఆచరించేందుకు ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో నివసించే వారు పిల్లలతో కలిసి స్వగ్రామాలకు చేరుకున్నారు. మరోవైపు పూలు, ప్రమిదలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వీటితో పాటు బాణసంచా కొనుగోళ్లు సైతం జోరుగా సాగుతున్నాయి. ప్రధాన రహదారులు, మార్కెట్‌లలో పూలు, మట్టి ప్రమిదల కొనుగోళ్లతో సందడిగా మారాయి.
