తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని.. ఈ పదేళ్ల కాలంలో గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు.
పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చారు? తేల్చుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని? చర్చకు ఆహ్వానిస్తూ ఆయన లేఖ రాశారు.









