ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు.. రైతుల్లో హర్షాతిరేకం
ఆదిలాబాద్ : టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ సత్తుమల్లేష్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆదిలాబాద్ సభలో మల్లేష్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కుఫ్టీ ప్రాజెక్టు బోథ్ నియోజకవర్గంలో అవసరం ఉందని మిత్రుడు మల్లేష్ నా దృష్టికి తెచ్చిండు. ఖచ్చితంగా కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి చేస్తా. ఈ ప్రాంతానికి నీళ్లిచ్చి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సభలో ప్రకటించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కుఫ్టి ప్రాజెక్టు మంజూరీ ప్రకటించేందుకు సహకరించిన సత్తు మల్లేష్ కు బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.









