సంగారెడ్డి : అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ నివాసముంటున్నాడు. అయితే పక్క పోర్షన్‌లో నివాసముంటున్న ఓ మహిళ పట్ల డిప్యూటీ తహసీల్దార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీసి వేధిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది.
డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేని ఆమె అతని చెంప ఛెల్లుమనిపించింది. అనంతరం తన భర్తకు సమాచారం ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్‌పై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









