AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక నా సినిమాలు నేను చేసుకుంటా… వాటి జోలికి వెళ్ళను

“రాజకీయాలు, రాజకీయ నేపధ్య సినిమాలకు ఇకపై దూరంగా ఉంటా. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నా. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలని, సినిమా మేకింగ్‌లో కూడా ప్రేక్షకులను ఇన్‌వాల్వ్‌ చేయాలనుకుంటున్నా’’ అని వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఒకనొక సమయంలో అర్థవంతమైన చిత్రాలు చేసి సూపర్‌డూపర్‌ హిట్‌ చేసిన ఆయన కొంతకాలంగా ఆ బ్రాండ్‌కే దూరంగా ఉన్నారు. ఆర్‌జీవీ గొప్ప టెక్నీషియన్ అనే పేరును కొంతకాలంగా ఆయన ఎంచుకున్న కథలతో చెడగొట్టుకున్నారు.

ఇప్పుడు రూట్‌ మార్చానని చెబుతున్నారు. ఈ మేరకు ‘యువర్ ఫిల్మ్’ (Yours Film) పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆయన లాంచ్ చేశారు. మెజారిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్లు తమకు నచ్చే సినిమాను ఆడియన్స్‌ లైక్స్‌ ఆదారంగా డెమోక్రటిక్‌ విధానంలో చేయనున్నారు వర్మ. ఈ మేరకు శనివారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఏ సపోర్ట్‌ లేని ప్రతిభావంతులను ఎంకరేజ్‌ చేయాలన్నదే మా ఆలోచన. సినిమాకు సంబందించిన అన్నీ విభాగాల్లోనూ ది బెస్ట్‌ టాలెంట్‌ ఆడియన్స్‌ ద్వారానే గుర్తిస్తాం. అనంతరం వారితో మేం సినిమా తీస్తాం. క్రౌడ్‌ ఫండెడ్‌ ఆలోచన కూడా ఉంది’ అని అన్నారు.

ANN TOP 10