AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దూసుకెళ్తున్న గోల్డ్ రేటు..

మండుతున్న బంగారం ధరల్ని చూస్తే… కన్జ్యూమర్ గుండెలు గుభేల్‌మంటున్నాయి. ప్రతిరోజూ కనీసం 500 రూపాయలు పెరుగుతూ ఆకాశమే హద్దు అనేంతగా దూకుడు మీదుంది. గత పదిరోజుల్లోనే ఏకంగా 4 వేలు పెరిగిందంటే.. అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేలు పైనే పలుకుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర ఒకేరోజు 1500 మేర పెరిగింది. 55 వేలకు పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2 వేల డాలర్లున్న ఔన్స్ ధర 3 వేల డాలర్లు కావొచ్చని నిపుుణులంటున్నారు.

ఒక్క వారంలో గ్రాముకి 500 పెరిగిన బంగారం ధర వినియోగదారుల్ని వణికిస్తోంది. బంగారం కొనేందుకు భయపడుతున్నామని, బంగారం మీద మక్కువను చంపుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ అవడంతో బంగారం కొనేందుకు వస్తున్న కస్టమర్స్ ధరలు చూసి గుటకలు మింగుతున్నారు. బంగారం ధర ఇలా జెట్‌ స్పీడుతో పరుగు పెట్టడానికి కారణం ఏంటంటే చాలానే చెప్పకొస్తారు ఎక్స్‌పర్ట్‌లు. అమెరికా డాలర్ బలహీనపడటం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం లాంటి పరిణామాలు కీలకం. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర చుక్కల్ని తాకేసింది.

అమెరికన్ బ్యాంక్స్ కొలాప్స్‌ కావడం ఈ గోల్డ్ క్రైసిస్‌కి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అటు.. దేశీయ, అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లు కూడా నానాటికీ పడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీ ఎప్పుడో మూల బడింది. ఇప్పుడు కొత్తగా బాండ్‌ మార్కెట్లు కూడా పతనమౌతున్నాయి. ఇదే క్రైసిస్ కనీసం మరో మూడునెలలు కంటిన్యూ అవుతుంది గనుక… 10 గ్రాముల బంగారం 90 వేలకు చేరుకోడానికి ఎంతో టైమ్ పట్టదన్నది బెంబేలెత్తిస్తున్న వార్త.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10