జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ (Chinnonipalli Reservoir) పనులు (Works) రద్దు చేయాలంటూ 423 రోజులుగా 5 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్దమయ్యారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించారు. గ్రామంలో 144 సెక్షన్ (144 Section) విధించినట్టు వెల్లడించారు.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు 423 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. శనివారం ఉదయమే గ్రామానికి చేరుకున్న పోలీసులు రైతులు ఎక్కడ ఉన్నారో ఆరా తీశారు. గతంలో దీక్షలో పాల్గొన్నవారిని, రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుతో భయాందోళనకు గురైన పలువురు రైతులు, యువకులు ఊరు విడిచి వెళ్లిపోయారు. అనంతరం రిజర్వాయర్దగ్గరకు వెళ్లి రైతుల దీక్షను భగ్నం చేశారు. మొత్తం 40 మంది రైతులను గట్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.