AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ ఖరారు చేసింది. వైవీ సుబ్బారెడ్డి, మేడా రాఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావును తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా, రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 16న దరఖాస్తుల పరిశీలన ఉంటుంది.

ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఒకవేళ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధ్రువపత్రాలు అందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్‌ బాబు పదవీ కాలం ముగియనుంది. వీరు ముగ్గురు ఏప్రిల్‌ 2వ పదవీవిరమణ చేస్తారు. వీరి స్థానాల భర్తీకే ఎన్నికలు జరుగుతాయి.

ANN TOP 10