భాగ్యనగరంలో పలుచోట్ల ఎన్‌ఐఏ (NIA) సోదాలు కలకలం రేపుతోంది. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించింది. విరసం నేత వరవరరావు అల్లుడు వేణుగోపాల్.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హిమాయత్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఎల్బీనగర్‌లోని రవిశర్మ నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









