AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా అదే టైం లో ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రులే జైలుకు వెళ్లారని విమర్శించారు. గత ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం అని ఆరోపించారు. మోడీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుస్థిర పాలన సాగుతోందని కొనియాడారు.

మోడీ పాలనలో మతకలహాలు, బాంబు పేలుళ్ళు లేవన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదని విమర్శించారు. జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు అమలు చేస్తుందనేది చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ గెలిచినా ఏమి చేయలేరు.. బీఆర్ఎస్‎కు ఓటు చేస్తే వృధా అవుతుందని చెప్పారు. ఏ ఒక్కరూ ఓటు వృధా చేసుకోవద్దని సూచించారు. భారతీయ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామమందిరం అన్నారు. సోమవారం అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి హిందువు పండగ చేసుకుంటున్నారని చెప్పారు.

ANN TOP 10