AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

రెయిలింగ్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన నగర శివారులో జరిగింది. మరో ఇద్దరు విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. పహాడీషరీఫ్‌ ఎస్సై వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. పాతబస్తీ ఫతేదర్వాజాకు చెందిన మొహ్మద్‌ సాజిద్‌ (18), హసన్‌నగర్‌ వాసులు మొహ్మద్‌ అక్బర్‌ (22), నయీముద్దీన్‌ (21), లంగర్‌హౌస్‌ నివాసి రాహిల్‌ భార్య నాజియాబేగం (23), టోలిచౌకికి చెందిన సల్మాన్‌ఖాన్‌ భార్య ముస్కాన్‌ మహరాజ్‌ (22)లు బెలీనో కారులో శుక్రవారం రాత్రి నగర శివారులోని పహాడీషరీఫ్‌ మీదుగా విమానాశ్రయ మార్గానికి చేరుకున్నారు.

అర్ధరాత్రి 12 గంటలు సమయం దాటిన సమయంలో శ్రీశైలంరోడ్డుపై చక్కర్లు కొట్టి.. ఆదానీ ఎయిర్‌ హొస్సేస్‌ కంపెనీ, హర్డ్‌వేర్‌ పార్కు దాటి మామిడిపల్లి మార్గంలోకి ప్రవేశించారు. సూచికలు లేకపోవడంతో కారు వేగంగా మార్గం ముగింపులోకి వెళ్లి కొండ ప్రాంతంలో ఉన్న రెయిలింగ్‌ను ఢకొీట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవింగ్‌ సీటులో ఉన్న సాజిద్‌, పక్కనే కూర్చున్న అక్బర్‌, వెనుక ఉన్న నాజియాబేగం నుదుటి భాగాలు పగిలి.. శరీరభాగాలు ఛిద్రమై సంఘటన స్థలంలోనే మరణించారు. నయీముద్దీన్‌, ముస్కాన్‌ బేగంల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10