అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సిద్దిపేటలో జరిగిన ఓట్ల లెక్కింపులో గజ్వేల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ విజయం సాధించారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ గెలుపొందిన ధ్రువీకర పత్రాన్ని ఆదివారం తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ ఒంటె ప్రతాప్ తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డికి జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అందజేశారు. సోమవారం మర్కకు మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.









