హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు వైఎస్ వివేకా కూతురు సునీత చేరుకున్నారు. నేడు ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది. తన విచారణ సమయంలో ఆడియో, వీడియోగ్రఫీ రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అవినాష్ రెడ్డి పిటిషన్‌లో తనను ఇంప్లీడ్ చేయాలని సునీత కోరనున్నారు. అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో సునితపై వ్యక్తిగత అంశాలు పేర్కొనడంపై తన వాదన వినాలని సునీత కోరనున్నారు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇప్పటికి రెండుసార్లు సీబీఐ ముందు హాజరయ్యారు. శుక్రవారం ఆయన మరోమారు విచారణకు హాజరవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అవినాశ్ రెడ్డిని అరెస్టు భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే… ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్‌లో సీబీఐపై ఆయన అనేక ఆరోపణలు చేశారు. అంతేకాదు… వివేకా కుటుంబంలో చాలా వివాదాలున్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయనకు ముప్పు ఉండిందని తెలిపారు. ‘‘నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదు. జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండు దఫాలు సీబీఐ తనను విచారించింది. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోంది.