తెలంగాణ రాజకీయ వేడి ఢిల్లీకి చేరింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేస్తుండగా… లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చింది.దీంతో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. నేడు పరస్పరం ధర్నాలతో హస్తినలో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభంకానుంది.‘మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడం కోసం చేపట్టిన ఈ ధర్నాను… దీనిని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రారంభిస్తారు.చట్టసభలల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో గళం వినిపించనున్నారు కవిత.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష జరగనుంది. అలాగే కవిత చేపడుతోన్న దీక్షకు మొత్తం 18 పార్టీల ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే మహిళా రిజర్వేషన్ల దీక్ష చేపడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు వేదికగా మారనుంది.ఇప్పటికే 18 పార్టీల ప్రతినిధులు వస్తుండగా…BRS నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.సీతారం ఏచూరి,డీ.రాజా వంటి కీలక నేతలు కూడా వస్తున్నారు.ఇక తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ధర్నాలో పాల్గొననున్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్‌మంతర్‌లో కవిత నిరాహార దీక్ష.. అటు లిక్కర్‌స్కామ్‌కు వ్యతిరేకంగా దీన్‌దయాల్ మార్గ్‌లోని ఆంధ్ర స్కూల్ వద్ద బీజేపీ ఢిల్లీ యూనిట్ చేపడుతోన్న ధర్నాతో.. నేడు ఢిల్లీలో హైవోల్టేజ్ పొలిటికల్ హీట్ ఖాయంగా కనిపిస్తోంది.