ఎల్‌బీ నగర్ లో అర్టిసి మహిళ కండక్టర్ గంజి శ్రీ విద్య (48) ఆత్మహత్యకు పాల్పడింది. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్‌గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈ నెల 12 న ఆమె సస్పెన్షన్ గురైంది. దీంతో తీవ్ర మనోవేదన గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుని శ్రీవిద్య స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీ విద్య మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదు ఆధారంగా ఎల్‌బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









