ప్రధాని మోదీకి లేఖ
న్యూఢిల్లీ: మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 9 మందితో కూడిన విపక్షాలæబృందం లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, అప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత భగవంత్‌మాన్,ఆర్‌జేడీ·నేత·తేజస్వియాదవ్·,జేకేఎన్‌సీ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన యూబీటీ ఉద్ధవ్‌ఠాక్రే, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రధాని మోదీకి సంయుక్తంగా లేఖ రాశాయి.
లేఖలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోందని లేఖలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమేనని అభిప్రాయపడ్డాయి. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమేనని నమ్ముతున్నాం.. ప్రజాతీర్పును గౌరవించాలని విపక్షాలు లేఖలో పేర్కొన్నారు.