AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పట్టున్ననేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఓ ఫాసిస్ట్‌గా రాష్ట్రాన్ని ఏలుతున్నాడు..
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తానేక్కడా చూడలేదని మండిపడ్డారు. ఒక ఫాసిస్ట్‌గా కేసీఆర్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని ఫైరయ్యాడు. కేసీఆర్ సర్కార్‌లో ఏ వర్గానికి కూడా న్యాయం జరుగలేదన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి నియంతలా పాలిస్తున్నాడని.. అన్ని వర్గాలను ఎన్నికలకు వాడుకుంటున్నాడని తెలిపారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయాడని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతులను మభ్య పెట్టేందుకు రుణమాఫీ, ఆర్టీసీ కార్మికులను లొంగదీసుకునేందుకు ప్రభుత్వంలో విలీనం అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో జరిగిన అవినీతి గతంలో ఎన్నడూ జరుగలేదని.. తెలంగాణలో కుటుంబ పాలన అంతమే తన లక్ష్యమన్నారు.

ANN TOP 10