AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోనాల ఊరేగింపులో ఉద్రిక్త‌త‌.. ముగ్గురికి క‌త్తిపోట్లు

హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా నిన్న బోనాల పండుగ ఘ‌నంగా జ‌రిగింది. తార్నాక‌లో మాత్రం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. బోనాల ఊరేగింపులో భాగంగా స్నేహితుల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. దీంతో రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన స్నేహితులు.. క‌త్తుల‌తో దాడులు చేసుకున్నారు. ఓ ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ముగ్గురిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ఉస్మానియా యూనివ‌ర్సిటీ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ANN TOP 10