AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దుబ్బాక అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.. రఘునందన్‌ ఆవేదన

దుబ్బాక అభివృద్ధి విషయంలో కొందరు నాయకులు అడుగడుగునా ఆటంకాలు కల్పించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… 2016లో సీఎం దుబ్బాకకు వచ్చినప్పుడు ఫైర్ స్టేషన్ కొరకు ఒక ఎకరం భూమి రైతు ఇస్తే ఇంతవరకు ఎలాంటి నిర్మాణం లేదని ఆవేదన చెందారు. సాక్షాత్తు సీఎం చెప్పిన మున్సిపల్ భవనానికి కూడా అతీగతీ లేదంటే అర్థం వీరి కపట ప్రేమ అర్థం చేసుకోవచ్చన్నారు.

గజ్వేల్, సిద్దిపేటలో ఆగమేఘాల మీద భవనాలు నిర్మించారని.. దుబ్బాక‌లో ఎందుకు నిర్మించరని ప్రశ్నించారు. సిద్దిపేటలో విపంచి, గజ్వేల్‌లో మహంతి ఆడిటోరియం ఎట్లా పూర్తి చేశారు?.. దుబ్బాకలో ఎందుకు చేయడం లేదని నిలదీశారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు వచ్చి 16 నెలలు గడిచినా ఎలాంటి టౌన్ అభివృద్ధి చేస్తలేరు.. చేయనిస్తలేరని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఐఓసీ భవనాలు పూర్తి అయిన దుబ్బాకలో ఇంకా కాలేదన్నారు. ప్రతి పక్షాలు ఉన్న చోట ఒక న్యాయం పాలక పక్షం ఉన్న చోట ఒక న్యాయం దురదృష్టకరమన్నారు.

ANN TOP 10