AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెనుక గర్ల్‌ఫ్రెండ్‌ను పెట్టుకుని.. అడ్డూఅదుపు లేకుండా రోడ్ల మీద..

ఇటీవలే ఓ యువకుడు బండి నడుపుతూనే.. తన ప్రేయసితో రొమాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. కాగా.. ఇప్పుడు ఓ యువకుడు తన ప్రేయసిని వెనక ఎక్కించుకుని ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చేసిన స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

వెనుక గర్ల్‌ఫ్లెండ్ ఉండటమేమో కానీ.. బండి ముందు చక్రాన్ని అమాంతం గాల్లోకి లేపి మెరుపు వేగంతో దూసుకెళ్లాడు యువకుడు. ఆ అమ్మాయి కూడా ఏమాత్రం భయపడకుండా.. తన బాయ్ ఫ్రెండ్ మీద నమ్మకంతో.. ఆ స్టంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. వీళ్ల ఫ్రెండ్స్.. ఈ విన్యాసాన్ని వీడియో తీస్తూ.. చీర్స్ చెప్పారు. అయితే.. ఈ వీడియో.. ఇన్‌స్టా గ్రాంలో పెట్టేందుకే తీసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే.. గర్ల్‌ఫ్రెండ్‌ను వెనుక కూర్చోబెట్టుకుని ఇదేం పనిరా నాయనా.. కొంచెం అటో ఇటో అయితే.. ఇద్దరి తలలు పగిలి.. గాల్లో కలిసిపోవటం ఖాయం.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ వీడియోలో ఇద్దరు కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకపోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు హైదరాబాద్‌లో అర్ధరాత్రులు అక్కడక్కడా చాలా జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, తీగల వంతెనపై యువకులు ఖరీదైన బైకులతో పందెం వేసుకుని మరీ విన్యాసాలు చేస్తుంటారు. కాగా.. ఇలాంటివి చేయొద్దని.. పోలీసులు చాలా సార్లు హెచ్చరించార కూడా యువతలో మార్పు రావడంలేదు.

ANN TOP 10