ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. ఈడీ (Enforcement Directorate) తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని..అలాగే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటీషన్ లో ఆమె పేర్కొన్నారు. కాగా గతంలో కవిత ను విచారించిన ఈడీ ఆమె దగ్గరి నుంచి కీలక పత్రాలు, పలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు తెలిపారు. కానీ ఒక మహిళను రాత్రి సమయం వరకు విచారించడాన్ని తప్పుబడుతూ కవిత తాను దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. మరి ఈడీ తో ఢీ అంటున్న కవిత కు నేడు సుప్రీంలో ఊరట లభిస్తుందా? లేక ఎదురుదెబ్బ తగులుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.
కాగా లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈనెల 11న తొలిసారి ఆమె ఈడీ విచారణకు హాజరవ్వగా..సుమారు 8 గంటలకు పైగా అధికారులు విచారించారు. ఆ తరువాత నిన్న కూడా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. ఇక ఈరోజు కూడా 10 గంటలు కవిత పై ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 30 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు.









