తెలంగాణ బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు కేంద్రం భద్రత పెంచనుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ఈ ఇద్దరికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు సిఆర్పిఎఫ్ (CRPF) భద్రత కల్పించనుంది. ఈటల రాజేందర్ కు వై ప్లస్ కేటగిరి, ధర్మపురి అర్వింద్ కు వై కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించింది. దీనితో ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ (CRPF)బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్ కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు రక్షణ కల్పించనున్నాయి.
కాగా ఈ ఇద్దరు నాయకులకు భద్రత పెంచడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల ఈటల రాజేందర్ తనకు ప్రాణహాని ఉందని..తనను చంపేందుకు రూ.20 కోట్ల రూపాయల సఫారీ ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తనను చంపేందుకు చూస్తున్నారని ఈటల ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ఈ భద్రతను పెంచినట్లు తెలుస్తుంది.









